గంగాధర, రామడుగు, వెలుగు: కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని ఆచంపల్లికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ ఆరె తేజశ్రీ, చిన్నాచంపల్లి సర్పంచ్ గుడి రజిని, రామడుగు మండలంలోని రుద్రారం సర్పంచ్ భీమ యశోద శనివారం కాంగ్రెస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ముందుంటుందని, ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తోందని తెలిపారు. ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, జవ్వాజి హరీశ్, ప్యాక్స్ మాజీ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉప్పుల అంజనీప్రసాద్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు, ఏఎంసీ డైరక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో సర్పంచుల చేరిక
బోయినిపల్లి, వెలుగు: కొత్తపేట సర్పంచ్ ఇల్లందుల రాజేశం, మల్కాపూర్ సర్పంచ్ మడ్లపల్లి తులసి శనివారం కాంగ్రెస్ లో చేరారు. కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డిని సన్మానించారు. మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, నాయకులు ముదిగంటి సురేందర్ రెడ్డి, వేసిరెడ్డి దుర్గారెడ్డి, సువీన్ యాదవ్ తదితరులున్నారు.
