వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మరో కొద్ది రోజుల్లో 2025 వ సంవత్సరం కాలగర్భంలో చేరిపోనుంది. ఈ వారంలో గురు వారం 2026 వ సంవత్సరం ప్రారంభం కానుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త సంవత్సరం మొదటి వారంలో ( డిసెంబర్28 నుంచి 2026 జనవరి3 వరకు) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.. ఎవరికి అదృష్టం కలిసి వస్తుంది.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారంరాశి ఫలాలను తెలుసుకుందాం..
మేషం : ఈ రాశి వారికి ఈవారంలో శని ప్రభావం వల్ల పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారులు అనుకోని విధంగా ధన లాభాలను సంపాదిస్తారు. ఉద్యోగాలు సానుకూలంగానే సాగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వీసా ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. కీలక నిర్ణయం తీసుకొనే విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించండి అంతా మంచే జరుగుతుంది.
వృషభం : ఈ వారం ఈ రాశి వారు తీరిక లేకుండా గడిపే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. చంద్రుని శుభదృష్టి వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. . ఆర్థిక విషయాల్లో కొత్త నిర్ణయాలు అమలుచేసే అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు వస్తాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. జీవిత భాగస్వామి సలహాలు కలిసి వస్తాయి.
మిధునం : ఈవారం ఈ రాశి వారు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారులు ఊహించిన విధంగా లాభాలు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. బ్యాంకు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. రాజకీయాలు ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన కానుకలు కొంటారు. ఖర్చుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కర్కాటకం : ఈ వారం, మీ మనస్సు కొంచెం భారంగాఉండే అవకాశం ఉంది. చిన్న తప్పులు కూడా మీ సామాజిక ప్రతిష్టను ప్రభావితం చేస్తాయి. పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. సీనియర్ అధికారులు వారం మధ్యలో మీకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఇక ఆర్థిక విషయానికొస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలు.. ఆందోళన కలిగిస్తాయి. వారం చివరిలో కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సింహం : ఈ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ పనైనా శ్రమ మీద గానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఉద్యోగులకు ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కన్య : ఈ రాశి వారికి కుటుంబసభ్యుల మధ్య బంధం బలపడుతుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. గతంలో వివిధ కారణాల వలన నిలిచి పోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలను వాయిదా వేసుకోండి. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి.
తుల : ఈ రాశి వారు ఈ వారం చాలా బిజీగా గడుపుతారు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసులో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగిపోతాయి. బిజినెస్ చేసే వారు లాభాల బాటను కొనసాగిస్తారు. జీవిత భాగస్వామి ఆలోచనలు తీసుకుంటే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసివస్తాయి.
వృశ్చికం : ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. మాట పట్టింపునకు పోకుండా మీ పని మీరు చేసుకోండి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులు ఆశించిన సంస్థలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సు : ఈ వారం, ఈ రాశి వారికి కష్టకాలం ఉంటుంది. అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆలలస్యంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం వలన లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కావున ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
మకరం : ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు, ఉద్యోగస్తులకు వేతనంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి, పూర్వీకుల ఆస్థి కలసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కుంభం : ఈ వారం ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఈ వారం మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పోతుంది. అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.
మీనం : ఈ వారం ఈ రాశి వారికి అన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రతి పనిని సవాళ్లతో పూర్తి చేస్తారు. డబ్బు పొదుపు చేస్తారు. . కుటుంబ వ్యవహారాలపై శ్రద్ద చూపాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇప్పటివరకు ఉన్న కుటుంబసభ్యుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. వారం చివర్లో పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
