
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ఖమ్మంలోని అంకుర హాస్పిటల్ లో 9ఎం ఫెర్టిలిటీ, చైల్డ్ డెవలప్మెంట్సెంటర్ ప్రారంభించినట్లు అంకుర సంస్థల డైరెక్టర్ డాక్టర్ చల్లగుల్ల రాకేశ్ బుధవారం ప్రకటించారు. వైద్య రంగంలో నైతిక విలువలు పాటిస్తూ, పారదర్శకమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
వంధ్యత్వ సమస్యలు అధికంగా ఉన్న తరుణంలో సంతానోత్పత్తి సంరక్షణతో పాటుగా పిల్లల అభివృద్ధికి అవసరమైన వైద్యసేవల్లో భాగంగా ఇప్పటికే హైదరాబాద్, పూణే, భువనేశ్వర్ లోని అంకుర హాస్పిటళ్లలో 9ఎం ఫెర్టిలిటీ సెంటర్లను ప్రారంభించి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఇకపై ఖమ్మం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా అంకుర హాస్పిటల్ లో ఫెర్టిలిటీ, చైల్డ్ డెవలప్మెంట్సేవలు పొందవచ్చన్నారు.