వాడి పడేసిన స్పూన్లు.. అక్కర్లేని బ్యాటరీలు.. పనికిరాని కంప్యూటర్ డిస్క్‌లు.. మెటల్ వస్తువులు… ఏదైనా సరే అతని చేతిలో పడితే.. చక్కని కళాఖండం అవ్వాల్సిందే. వ్యర్థానికి కొత్త అర్థం చెబుతూ అద్భుతమైన బొమ్మలను తయారుచేస్తున్నాడు యూఎస్‌కు చెందిన బ్రెయిన్ మాక్. చిరుతలు, రోబోలు, సింహాలు, మనుషుల ఆకారాలకు చక్కని రూపం ఇస్తున్నాడు. మ్యూజియమ్స్‌లో, పబ్లిక్ ప్లేసుల్లో కనిపించే మార్క్ బొమ్మలను చూసే చాలామంది, అతని ఆర్ట్‌కు ముగ్ధులవుతున్నారు. క్రియేటివ్‌గా, రియలిస్టిక్ ఉండటంతో, మార్క్‌తో తమకు ఇష్టమైన బొమ్మలు చేయించుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా మెటల్ వస్తువులతో కళాఖండాలను తయారు చేస్తుండటంతో మెటల్ రెవల్యూషనిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు.

