ముంబైతో మ్యాచ్.. హైదరాబాద్ కే గెలిచే అవకాశాలెక్కువట

ముంబైతో మ్యాచ్.. హైదరాబాద్ కే గెలిచే అవకాశాలెక్కువట

షార్జా: ఐపీఎల్ సీజన్-13లో భాగంగా మంగళవారం కీలక మ్యాచ్ జరగనుంది. పటిష్టమైన ముంబైతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చావో రేవో అయిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కు గెలిచే అవకాశాలెక్కువట. ప్లే ఆఫ్ కు చేరేందుకు కీలకమైన ఈ మ్యాచ్ లో ముంబైపై హైదరాబాద్ గెలుస్తుందని  విండీస్‌ దిగ్గజం.. మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా చెప్పాడు.  ముంబై.. ఈ మ్యాచ్‌ లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందన్నాడు. ఇప్పటికే లీగ్‌ లో దుమ్మురేపే ప్రదర్శనతో టాప్‌ స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌ కు అడుగుపెట్టిన ముంబై ..ఈ మ్యాచ్‌ ను పెద్దగా పట్టించుకోదని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు అవకాశం రాని ఇద్దరు ముగ్గురు ప్లేయర్లకు ముంబై ఇవాళ్టి టీమ్ లో చోటు లభించే అవకాశం ఉందన్నాడు. ఈ అవకాశం SRHకు లాభం చేకూర్చనుందని.. దీనిని వినియోగింకొని సన్ రైజర్స్ ప్లేఆఫ్‌ చేరుతుందనే అనుకుంటున్నా అని తెలిపాడు లారా.

బౌలింగే కీలకం:

రెండు టీమ్స్ లోనూ ఈ మ్యాచ్ లో బౌలింగే కీలకం కానుందని చెబుతున్నారు స్పోర్ట్స్ ఎనలిస్టులు. హైదరాబాద్ బౌలింగ్ లోనూ ఎక్కువ రన్స్ చేయడం గగనమేనని.. అలాగే ముంబైలోనూ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి బౌలర్లను తట్టుకోవాలంటే మంచి హిట్టింగ్ చేస్తే తప్ప హైదరాబాద్ బిగ్ స్కోర్ చేయలేదని చెబుతున్నారు. మరి చూడాలి తప్పక గెలువాల్సిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు ఏమైనా మ్యాజిక్ చేస్తారో లేదో. ఆల్ ద బెస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్.