నెట్ వర్క్ ప్రసారాలు నేరుగా మాకే ఇవ్వండి

నెట్ వర్క్ ప్రసారాలు నేరుగా మాకే ఇవ్వండి

సీసీసీ సిటికేబుల్, హైటెక్ నెట్‌వర్క్, బ్రైట్‌వే ప్రసారాలు నేరుగా అందజేయాలని దండేపల్లి, జన్నారం మండలాలకు చెందిన కేబుల్‌ అపరేటర్లు కోరారు. బుధవారం సీసీసీ లో హైటెక్ నెట్ వర్క్ అధినేత, బ్రైట్‌వే డైరెక్టర్ మహ్మద్ మౌలానాకు తమ సమస్యలు వివరించి, వినతిపత్రం అందజేశారు. హైటెక్ నెట్‌వర్క్ డిజిటల్ ఆపరేటర్లుగా తాముపదేళ్లుగా ప్రసారాలు చేస్తున్నామని, హైటెక్ నెట్‌వర్క్ మధ్యవర్తులమంటూ గుండ రవీందర్, గుండ శ్రీనివాస్ నెలనెలా డబ్బులు వసూళ్లు చేస్తున్నా, మెయింటనెన్స్ చేయకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. వారే కేబుల్ వైర్లు కట్ చేసి తమపై నేరం మోపుతున్నారని,పోలీస్ స్టేషన్‌లో కేసులు పెడ్తున్నారన్నారు. తమకుఈ వేధింపులు లేకుండా నేరుగా ప్రసారాలు అందజేయాలని, లేకుంటే హైటెక్ ఆఫీసు ముందు నిరహారదీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అపరేటర్లు బండి రాజయ్య, చిక్కాల బీరయ్య, కొ త్తపల్లి నర్సయ్య, సోగాల శ్రీనివాస్, దేవ్ రావు, గంగారపు సాగర్ పాల్గొన్నారు.