వీ6 లోగోతో బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రచారం..

వీ6 లోగోతో బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రచారం..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు చేసే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్  వెల్లడించిన క్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ నాయకులపై  దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజా గొంతుక వినిపించే వీ6 ఛానల్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కోడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటర్లపై ఆక్రోశం ప్రదర్శించాడంటూ వీ6 ఛానల్ లోగోతో ఫేక్ బ్రేకింగ్ ప్లేట్లు సృష్టిస్తున్నారు. ఓడిపోతే కోడంగల్ లో తిరగనివ్వనని ఓటర్లను రేవంత్ రెడ్డి బెదిరించినట్టు బ్రేకింగ్ ప్లేట్లు సృష్టించి సోషల్ మీడియాలో సర్కూలేట్ చేస్తున్నారు. పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి మహేష్ రెడ్డి పిఆర్వో నే నేరుగా వీ6 ఫేక్ బ్రేకింగ్ ప్లేట్లు స్థానిక వాట్సప్ గ్రూపుల్లో సర్కులేట్ చేశారు.