V6 News

గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. బుధవారం హైదరాబాద్‌లో తగ్గిన రేట్లివే..

గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. బుధవారం హైదరాబాద్‌లో తగ్గిన రేట్లివే..

అక్షయ తృతీయ తర్వాత నెమ్మదిగా బంగారం రేట్లు దేశంలో తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు అమెరికా ఇరాన్ చర్చలు ఏ దిశగా నడుస్తాయి.. శాంతి ఒప్పందానికి ఇంకా ఎంత సమయం పడుతుందనే అంశాలు బులియన్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ అండ్ సిల్వర్ పై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న చాలా మంది పెట్టుబడిదారులు తమ నిర్ణయాలను తాత్కాలికంగా హోల్డ్ చేస్తున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న ఇండియన్ రిటైలర్లు ముందుగా తమ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించటం బెటర్. 

ఏప్రిల్22న బంగారం రేట్లు తగ్గాయి. ఏప్రిల్ 21 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.54 తగ్గుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 475గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 185గా కొనసాగుతోంది. 

ALSO READ : బుల్స్ దూకుడుకు బ్రేక్.. మన మార్కెట్ల నష్టాలకు కారణాలు ఇవే..

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్22, 2026న దేశవ్యాప్తంగా రేటు స్థిరంగా కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 75వేల వద్ద మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.275గా అమ్మకాలు జరుగుతున్నాయి.