గుర్రంపోడు: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కియా సెల్టోస్ కారు బైక్ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వద్దిరెడ్డిగూడెం గ్రామ శివారులో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అలుగుబెల్లి జైపాల్ రెడ్డికి చెందిన TS 05 FP 2277 కియా సెల్టోస్ కారు గుర్రంపోడు వైపు వస్తున్న TS 05 EV 2192 నెంబర్ గల స్ప్లెండర్ మోటార్ సైకిల్‌ను ఢీ కొట్టింది.
ఈ దుర్ఘటనలో.. బైక్‌పై ప్రయాణిస్తున్న నర్సింగ్ ధనుంజయ, నర్సింగ్ మధుబాబు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో ఉన్న మరెడ్డి బాల్ రెడ్డి తీవ్ర గాయాలతో చనిపోయాడు. మరెడ్డి అలివేలు, మాలె వెంకటమ్మ, మాలె మంజులకు గాయాలయ్యాయి. ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఏప్రిల్ 7న కూడా ఇలాంటి దుర్ఘటనే జరిగింది. ట్రాక్టర్లో కరెంట్పోల్స్తీసుకెళ్తుండగా, ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే చనిపోయారు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యుత్ కాంట్రాక్టర్ దగ్గర ముల్కలపల్లి గ్రామానికి చెందిన ఈదుల సత్యనారాయణ(45), బొంత సైదులు(43) కూలీలుగా పని చేస్తున్నారు.
రోజు మాదిరిగానే విద్యుత్ స్తంభాలను పోచంపల్లి సబ్ స్టేషన్ నుంచి కాల్వపల్లికి ట్రాక్టర్లో తీసుకెళ్తుండగా, ముల్కలపల్లి గ్రామ శివారులో టాక్టర్ట్రాలీలో ఉన్న పోల్స్ఒక వైపునకు జరుగుతున్నాయని కూలీలు అరవగా, ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఇద్దరు కూలీలపై పోల్స్ పడడంతో అక్కడిక్కడే చనిపోయారు.

