V6 News

హైదరాబాద్లో NCB భారీ ఆపరేషన్.. రెండు డ్రమ్ముల డ్రగ్స్ సీజ్.. రూ.17.40 కోట్ల సరుకు !

హైదరాబాద్లో NCB భారీ ఆపరేషన్.. రెండు డ్రమ్ముల డ్రగ్స్ సీజ్.. రూ.17.40 కోట్ల సరుకు !

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) బుధవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్ మౌలాలిలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై రైడ్ చేసింది. రూ.17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. 69 కేజీల అల్ప్రజోలామ్, ఎఫెడ్రిన్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. 

హైదరాబాద్‌లోని మౌలాలీలోని ఐడిఎలో అల్ప్రజోలామ్, ఎఫెడ్రిన్‌ డ్రగ్స్ అక్రమంగా తయారు చేస్తున్న కేంద్రంపై ఎన్‌సిబి ( నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ) దాడులు చేసింది. 69.600 కిలోల అల్ప్రజోలామ్‌ను స్వాధీనం చేసుకుంది. ఎఫెడ్రిన్ డ్రగ్ తయారీ ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంది.

మౌలాలి పారిశ్రామిక రసాయన యూనిట్‌పై దాడి చేసి ముగ్గురు నిందితుల అరెస్ట్ చేసింది. ఈ సోదాల్లో రెండు ప్లాస్టిక్ డ్రమ్ములలో భారీగా డ్రగ్ మెటీరియల్ను NCB అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు డ్రమ్ముల నుంచి మొత్తం 69.600 కిలోల ఆల్ప్రజోలామ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

ఆల్ప్రజోలామ్‌తో పాటు, ఆల్ప్రజోలామ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, ఎఫెడ్రిన్ కోసం వాడే రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 17.40 కోట్లు ఉంటుందని తెలిపారు. ఒక కెమిస్ట్, మెటీరియల్ సప్లై చేసే వ్యక్తి, మెటీరియల్ తరలించే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఆల్ప్రజోలామ్‌ను వేసవిలో అధిక డిమాండ్ ఉండే తెలంగాణలోని కల్లు దుకాణాలకు విక్రయించనున్నట్లు NCB గుర్తించింది. ఈ ముగ్గురి నిందితులపై NDPS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి NCB దర్యాప్తు చేస్తుంది.