మే 17న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ

మే 17న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ

హైద‌రాబాద్ : తెలంగాణ భ‌వ‌న్‌లో మే 17వ తేదీన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న ఈ స‌మావేశం కొన‌సాగ‌నుంది. ఈ స‌మావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రు కానున్నారు.

కర్నాటక ఎన్నికలతో పాటు రాష్ర్టంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపైనా చర్చించనున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. బీఆర్ఎస్ పార్టీపై పడుతుందనే నడుస్తున్న చర్చపైనా మాట్లాడే అవకాశం ఉంది.