
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో మైక్ ఇవ్వనందుకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. భట్టి మాట్లాడుతుండగా తమకు మైక్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులకు మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్బంగా కేటీఆర్ డిప్యూటీ సీఎం భట్టిపై సీరియస్ అయ్యారు. మహిళా మార్షల్స్ తో అదుపుచేస్తున్నారని ఫైర్ అయ్యారు. మహిళలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ ఆ ప్రశ్నించారు. దీంతో అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు బీఆర్ఎస్ సభ్యులు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పేపర్స్ ను డస్ట్ బిన్ లో పడేశారు . వేస్ట్ రిపోర్ట్ ..కాంగ్రెస్ రిపోర్ట్ అంటూ పడేశారు.
అనంతరం గన్ పార్క్ దగ్గరకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేపట్టారు. సభలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనకు దగారు. ప్రభుత్వం వన్ సైడ్ గా సభ నడుపుతుందంటూ విమర్శించారు.