మెడికల్ సీట్లలో ఉమ్మడి కోటాను రద్దు చేయండి : ఎమ్మెల్యే హరీశ్‌‌రావు

మెడికల్ సీట్లలో ఉమ్మడి కోటాను రద్దు చేయండి : ఎమ్మెల్యే హరీశ్‌‌రావు
  • సర్కార్‌‌‌‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : మెడికల్ సీట్ల భర్తీలో ఉమ్మడి కోటాను రద్దు చేసి, తెలంగాణ విద్యార్థులకు సీట్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం పదేండ్ల ఉమ్మడి కోటా గడువు పూర్తయిన నేపథ్యంలో ఎంబీబీఎస్‌‌, మెడికల్ పీజీ సీట్ల కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి ఆ కోటా రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందున్న 20 మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఉమ్మడి కోటా(15 శాతం) కొనసాగుతోంద ని దానిని రద్దు చేయాలని కోరుతూ శనివారం హరీశ్‌‌రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ ఈ కోటాను రద్దు చేయకపోతే తెలంగాణ స్టూడెంట్లు 280 ఎంబీబీఎస్ సీట్లు, 150 పీజీ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.