హైదరాబాద్ పాతబస్తీలో దారుణహత్య

హైదరాబాద్ పాతబస్తీలో దారుణహత్య

హైదరబాద్: పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరింది. ముకర్రమ్ ( 43 )  అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హతమార్చారు. కాలాపత్తర్లోని చున్నికి భట్టి ప్రాంతంలో గురువారం జరిగిందీ ఘటన. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ముకర్రమ్ హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన సమీపంలో వున్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.