ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయండి : బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్

ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయండి : బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్  ఇబ్రాం శేఖర్ విమర్శించారు. నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసినట్లుగానే కాంగ్రెస్ కూడా మోసం చేస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు.  బీఆర్ఎస్  నిర్వహించిన ‘నిరుద్యోగ  సంగ్రామ సభ’ హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఏపీలో నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందనే తెలంగాణ ప్రజలు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారుని గుర్తుచేశారు.

ప్రజల సెంటిమెంటును ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్ పదేండ్లు మోసపూరిత విధానాలతో అధికారంలో కొనసాగిందన్నారు. నిరుద్యోగ యువతను కేసీఆర్ పట్టించుకోలేదని, బీఆర్ఎస్‌పై వ్యతికరేకతతోనే యువత  కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలపై పొంతన లేదని,  ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలు , బ్యాక్ లాగ్ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని శేఖర్  డిమాండ్ చేశారు.