స్క్రీన్ ప్లే తేలిపోయింది

స్క్రీన్ ప్లే తేలిపోయింది

టైటిల్ ‌‌: బబ్లీ బౌన్సర్,‌‌

‌‌కాస్ట్ ‌‌: తమన్నా భాటియా, అభిషేక్ బజాజ్, సాహిల్ ‌‌ వైద్, సౌరభ్ శుక్లా, సుప్రియా శుక్లా, ప్రియం సాహ, సబ్యసాచి చక్రవర్తి,

లాంగ్వేజ్: హిందీ, తమిళం, తెలుగు
ఫ్లాట్ ‌‌ఫాం: డిస్నీప్లస్ ‌‌ హాట్ ‌‌స్టార్,‌‌ రన్ ‌‌టైం: 118 నిమిషాలు 
డైరెక్షన్ ‌‌: మధుర్ భండార్కర్

ఫతేపూర్ బేరీ.. ఒక చిన్న టౌన్ ‌‌. బౌన్సర్లకు కేరాఫ్ అడ్రస్ ‌‌. అదే ఊళ్లో ఉండే బబ్లీ తన్వర్ (తమన్నా భాటియా) బాధ్యత లేకుండా అల్లరిగా తిరుగుతుంటుంది. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. తండ్రి (సౌరభ్ శుక్లా) గారాబం ఎక్కువ. అందుకే ఆమె తన తండ్రి చెప్పిన వ్యక్తిని పెండ్లి చేసుకుని హాయిగా ఉండాలి అనుకుంటుంది. అయితే.. అదే టైంలో తన టీచర్ కొడుకు విరాజ్ (అభిషేక్ బజాజ్)ని ఒక ఈవెంట్ ‌‌లో కలుసుకుంటుంది. అతనితో ప్రేమలో పడుతుంది. కానీ.. అతనికి ఎవరి మీద ఆధారపడకుండా బతికే అమ్మాయిలంటే ఇష్టమని తెలుసుకుని జాబ్ ‌‌ చేయాలని డిసైడ్ ‌‌ అవుతుంది. కుక్కు (సాహిల్ ‌‌ వైద్) సాయంతో ఢిల్లీలోని ఒక నైట్ పబ్ ‌‌లో బౌన్సర్ ‌‌ ‌‌గా చేరుతుంది. జాబ్ ‌‌లో చేరాక తన ప్రేమను విరాజ్ ఒప్పుకున్నాడా? బౌన్సర్ ‌‌ ‌‌గా  మారిన తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

మిల్కీ బ్యూటీ తమన్నా ఎలాంటి క్యారెక్టర్ అయినా ఈజీగా చేసేస్తుంది. ఆమె ఇప్పటివరకు చేసినవాటికన్నా ఈ రోల్ ‌‌ కాస్త డిఫరెంట్ ‌‌గా ఉంటుంది. బబ్లీ పాత్రలో బాగా ఒదిగిపోయింది. కష్టమైన బాడీ లాంగ్వేజ్ ‌‌ అయినా ఫర్ఫెక్ట్​గా చేసింది. కుక్కు  రోల్ ‌‌లో చేసిన సాహిల్ ‌‌ వైద్ బాగా నవ్వు తెప్పించాడు. అభిషేక్ బజాజ్, సౌరభ్ శుక్లా, సబ్యసాచి చక్రవర్తి కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ‌‌ ఇచ్చారు. కథ సింపుల్​గా ఉన్నా ప్రజెంట్ ‌‌ చేసిన విధానం బాగుంది. కాకపోతే.. చాలా సీన్లు ఇదివరకు ఎక్కడో చూశామే అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే తేలిపోయింది.