ఐపీఎల్ 2026లో ఫుడ్ వార్‌.. బిర్యానీని ఓడించి రికార్డ్ సృష్టించిన బర్గర్ ఆర్డర్స్

ఐపీఎల్ 2026లో ఫుడ్ వార్‌.. బిర్యానీని ఓడించి రికార్డ్ సృష్టించిన బర్గర్ ఆర్డర్స్

ఐపీఎల్ అంటేనే కేవలం క్రికెట్ కాదు.. అది ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్ కలిసిన ఒక పెద్ద పండుగ. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్న ఐపీఎల్ 2026 సీజన్ మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తుతుంటే.. ఆఫ్-ది-ఫీల్డ్ మాత్రం ఫుడ్ ఆర్డర్ల జోరు దూసుకుపోతోంది. అయితే ఈసారి అనూహ్యంగా భారతీయుల ఆల్-టైమ్ ఫేవరెట్ బిర్యానీని వెనక్కి నెట్టి 'బర్గర్' అగ్రస్థానంలోకి చేరుకోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్విగ్గీ, జియో హాట్‌స్టార్ భాగస్వామ్యంతో వచ్చిన ఇన్‌-యాప్ ఫుడ్ ఆర్డరింగ్ ఫీచర్ ఈ మార్పులను గమనించింది.

ఈ సీజన్‌లో ప్రేక్షకులు మ్యాచ్ చూస్తూనే నేరుగా స్ట్రీమింగ్ యాప్ ద్వారా నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసే సౌలభ్యం కలగడంతో ఆర్డర్ల సంఖ్య భారీగా పెరిగింది. గత సీజన్ల వరకు తిరుగులేని రారాజుగా ఉన్న బిర్యానీని ఈసారి బర్గర్లు అధిగమించాయని తాజా లెక్కలు బయటపెట్టాయి. ఒకే ఆర్డర్‌లో ఏకంగా 100కు పైగా బర్గర్లను ఆర్డర్ చేసి ఒక క్రికెట్ అభిమాని సరికొత్త రికార్డు సృష్టించాడు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నప్పుడు త్వరగా, ఈజీగా తినగలిగే స్నాక్స్ వైపు జనం మొగ్గు చూపడం బర్గర్ల అమ్మకాలను అమాంతం పెంచినట్లు తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక ఫుడ్ ఆర్డర్లు జరిగాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ ఆర్డర్లలో అతిపెద్ద స్పైక్‌ను నమోదు చేసింది. నగరాల వారీగా చూస్తే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. పాట్నా, పూణే వంటి నగరాల్లో కూడా భారీ డిమాండ్ కనిపించిందట. కేవలం 10 నిమిషాల 42 సెకన్లలోనే ఫాస్టెస్ట్ డెలివరీ కావడం ఈ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ సక్సెస్‌ చేసేసింది.

ALSO READ : విరాట్ కోహ్లీ, రొనాల్డోలకు షాక్.. 

కంపెనీలు చేపట్టిన "మ్యాచ్ ఆన్, మంచ్ ఆన్" ప్రచార కార్యక్రమం సుమారు 3 కోట్ల 70 లక్షల మంది వీక్షకులను ఆకర్షించింది. కేవలం ఒక్క ఆర్డర్‌పై రూ.6వేల 801 ఖర్చు చేసిన వారు ఒకవైపు ఉంటే.. ఆఫర్ల ద్వారా రూ.12వేల 947 ఆదా చేసిన వారు మరోవైపు ఉన్నారు. మొత్తానికి ఐపీఎల్ 2026లో బిర్యానీని బర్గర్ ఓడించడం అనేది కేవలం ఆహారపు అలవాట్ల మార్పు మాత్రమే కాదు.. టెక్నాలజీ, క్రికెట్ కలిసి సృష్టించిన సరికొత్త ట్రెండ్ అని చెప్పుకోవచ్చు.