విరాట్ కోహ్లీ, రొనాల్డోలకు షాక్.. రాత్రికి రాత్రే కోట్లలో ఫాలోవర్స్ అవుట్.. ఎందుకంటే?

 విరాట్ కోహ్లీ, రొనాల్డోలకు షాక్.. రాత్రికి రాత్రే కోట్లలో ఫాలోవర్స్ అవుట్.. ఎందుకంటే?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్గెస్ట్ సెలబ్రిటీలందరికీ షాక్ తగిలింది. సోషల్ మీడియా కింగ్స్ లా వెలిగిపోతున్న సెలబ్రిటీల ఫాలోవర్స్ కౌంట్ అకస్మాత్తుగా పడిపోయింది. రాత్రికి రాత్రే విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, అలియా భట్ లాంటి దిగ్గజాల అకౌంట్ల నుంచి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు మాయమైపోయారు. దీంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ షేక్ అయిపోయింది.  కానీ, దీని వెనుక అసలు కథ వేరే ఉంది!

అసలు కథ ఇదే!

మొదట ఇదంతా ఏదో టెక్నికల్ గ్లిచ్ అని, ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ డౌన్ అయిందని ఫ్యాన్స్ కంగారుపడ్డారు. కానీ అసలు నిజం తెలిశాక మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ మహా ఊచకోత వెనుక ఉన్నది మరెవరో కాదు.. ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ ‘మెటా’ బాస్ మార్క్ జుకర్‌బర్గ్. ప్లాట్‌ఫారమ్‌ను క్లీన్ చేయడానికి మెటా వేసిన భారీ స్కెచ్ ఇది. తమ సంస్థపై విశ్వసనీయతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఫేక్ ఐడీలా? ఆటలు సాగవు!

చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు, కామెంట్లు, ఫాలోవర్ల సంఖ్యను ఆర్టిఫిషియల్‌గా పెంచేందుకు ‘బాట్స్’ (Bots), ఫేక్ అకౌంట్లు, ఇన్‌యాక్టివ్ ప్రొఫైల్స్ హల్చల్ చేస్తున్నాయి. బ్రాండ్ వాల్యూను పెంచుకోవడానికి చాలామంది వీటిపై ఆధారపడుతుంటారు. వీటన్నింటికీ శాశ్వతంగా చెక్ పెట్టాలని డిసైడ్ అయిన మెటా.. ఒక భారీ ‘క్లీన్-అప్ డ్రైవ్’ చేపట్టింది. అందులో భాగంగా కోట్లాది నకిలీ ఖాతాలను డిలీట్ చేయడంతో సెలబ్రిటీల ఫాలోవర్ల గ్రాఫ్ దారుణంగా పడిపోయింది.

ఎవరికి ఎంత డ్యామేజ్?

ఈ ఫిల్టరింగ్‌లో గ్లోబల్ స్టార్స్ సైతం గిలగిలాడిపోయారు. ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఎగిరిపోయిన ఫాలోవర్ల లెక్కలు భారీగానే ఉన్నాయి. క్రిస్టియానో రోనాల్డో అకౌంట్ నుంచి ఏకంగా 66 లక్షల (6.6 Million) ఫాలోవర్లు మాయం అయ్యారు.  లియోనెల్ మెస్సి ఖాతా నుంచి దాదాపు 48 లక్షల మంది ఫ్యాన్స్ అవుట్ అయ్యారు. ఇక జస్టిన్ బీబర్ కు సుమారు 43 లక్షల మంది ఫాలోవర్లు మిస్ అయ్యారు.

ALSO READ : క్షుద్రపూజలపై ఉత్కంఠరేపే కథనం..

ఇక ఇండియన్ లో టాప్  సెలబ్రిటీలుగా ఉన్న వారి ఖాతా నుంచి కూడా భారీగా ఫాలోవర్లు మాయం అయ్యారు. వారిల్లో విరాట్ కోహ్లీ  ఖాతా నుండి ఏకంగా 20 లక్షల ఫాలోవర్లు ఎగిరిపోయారు. ప్రియాంకా చోప్రా, అలియా భట్, శ్రద్ధా కపూర్ వంటి వారు తలో 10 నుండి 11 లక్షల ఫాలోవర్లను కోల్పోయారు.

క్రెడిబిలిటీ కోసం క్రేజీ స్టెప్.

కేవలం సెలబ్రిటీలే కాదు, చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్లు, క్రియేటర్స్ కూడా ఈ దెబ్బకు విలవిలలాడారు. అయితే ఈ మార్పు వల్ల వారి రియల్ పాపులారిటీ తగ్గలేదని, కేవలం నకిలీ అకౌంట్లు కొట్టుకుపోయాయని నిజమైన ఫాలోవర్లు మాత్రమే మిగిలారని విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పారదర్శకతను పెంచేందుకు మెటా తీసుకున్న ఈ క్లీనింగ్ ప్రాసెస్ నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.