తాత్కాలిక డ్రైవర్‌‌‌‌ నడిపిస్తున్న ఆర్టీసీ బస్సు వృద్ధురాలిని ఢీకొట్టింది

తాత్కాలిక డ్రైవర్‌‌‌‌ నడిపిస్తున్న ఆర్టీసీ బస్సు వృద్ధురాలిని  ఢీకొట్టింది

వర్ధన్నపేట, వెలుగు: తాత్కాలిక డ్రైవర్‌‌‌‌ నడిపిస్తున్న ఆర్టీసీ బస్సు వర్ధన్నపేట మండలం ఉప్పరపెల్లి క్రాస్ రోడ్డు వద్ద ఓ వృద్ధురాలిని మంగళవారం ఢీ కొట్టింది. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి వరంగల్​కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వర్ధన్నపేటకు చెందిన ఫాతిమా బేగం ఉప్పరపెల్లి క్రాస్ రోడ్డు వద్ద పర్వతగిరికి వెళ్లడానికి ఆటో దిగి నడుచుకుంటు వెళ్తోంది. ఈ క్రమంలో తొర్రూర్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఫాతిమా బేగంను ఢీ కొట్టింది. దీంతో ఆమెకు చేయి విరగడంతోపాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితురాలిని వరంగల్ దవాఖానాకు తరలించారు.