హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. లాక్‌డౌన్‌లో బస్ పాసులు తీసుకుని (ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఎయిర్‌పోర్ట్ పుష్పక్ ఎసీ బస్) ఎన్ని రోజులు ఉపయోగించుకోలేదో అన్ని రోజులు మళ్లీ ఉపయోగించుకునే అవకాశాన్ని TSRTC కల్పించనుంది. దీంతో వినియోగదారులు అప్పటి బస్ పాస్‌ను కౌంటర్‌లో తిరిగి ఇచ్చేసి కొత్త కార్డు తీసుకోవాలని ఆర్టీసీ సూచించింది. కొత్త పాస్‌లో కోల్పోయిన రోజులను కలిపి పాసెస్ జారీ చేయనుంది. నవంబర్ 30 లోపు పాత ఐడీ కార్డు.. టికెట్ ను కౌంటర్ లో సమర్పించి కొత్త పాస్ తీసుకోవాలని సూచించింది ఆర్టీసీ. హైదరాబాద్ సిటీలో దాదాపు 20 లక్షల పాస్ లు ఉన్నాయన్నారు అధికారులు.
