DC vs KKR: ఢిల్లీది మళ్లీ పాత పాటే.. కుప్పకూలిన టాపార్డర్.. కోల్కతా ముందు స్వల్ప లక్ష్యం !

DC vs KKR: ఢిల్లీది మళ్లీ పాత పాటే.. కుప్పకూలిన టాపార్డర్.. కోల్కతా ముందు స్వల్ప లక్ష్యం !

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ మళ్లీ పాత పాటే పాడింది. స్టార్ బ్యాటర్స్ ఉన్నా.. టాపార్డర్ ఎప్పట్లాగే పెవిలియన్ కు క్యూ కట్టారు. టపా టపా వికెట్లు సమర్పించుకుంటూ చేతులెత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా ముందు 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త పర్లేదు అనిపించేలా ఓపెనర్లు ఆడారు. అంతలోనే పవర్ ప్లేలో వికెట్ కోల్పోయింది. 5వ ఓవర్ చివరి బాల్ కు కార్తీక్ త్యాగీ బౌలింగ్ లో గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్  23 (14 బాల్స్ లో 4 ఫోర్లు) ఔటయ్యాడు. ఇక 10వ ఓవర్ వచ్చే వరకు 3 వికెట్లు కోల్పోయి డిఫెన్స్ లో పడింది ఢిల్లీ. 8వ ఓవర్ చివరి బాల్ కు గ్రీన్ బౌలింగ్ లో నితీశ్ రాణా (8) అవుట్ అవ్వగా.. 10 ఓవర్ సునీల్ నరైన్ బౌలింగ్ లో 5వ బాల్ కు సమీర్ రిజ్వీ (3) పెవిలియన్ కు బాటపట్టాడు.  నిస్సాంక హాఫ్ సెంచరీ ( 29 బంతులలో 5 ఫోర్లు, 3 సిక్సులు) 10.1 ఓవర్లకు 84 రన్స్ చేయగలిగింది ఢిల్లీ.

10 ఓవర్ వరకు పర్లేదు అన్నట్లుగా స్కోర్ చేస్తూ వచ్చిన ఢిల్లీ ఆ తర్వాత పూర్తిగా చతికిల పడిపోయింది. 11వ ఓవర్ లో వెంటవెంటనే ఇద్దరు బ్యాటర్లు కుప్పకూలారు. టాప్ ఆర్డర్ కుప్పకూలటంతో  పీకల్లోతు కష్టాల్లో పడింది ఢిల్లీ. 11 ఓవర్ లో అనుకుల్ రాయ్ బౌలింగ్ లో పాతుమ్ నిస్సాంక (50) స్టంప్ ఔట్, స్టబ్స్ (2) బౌల్డ్ వెనుదిరగటంతో మ్యాచ్ పై కోల్ కతా పట్టు సాధించింది. 12 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 90 చేయగలిగింది. 

నిస్సాంక ఔటయ్యాక ఢిల్లీ పూర్తిగా ఢీలా పడిపోయింది. బ్యాటర్లు వికెట్లు కాపాడే ప్రయత్నంలో స్కోర్ చేయలేకపోయారు. 15 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 98 రన్స్ చేయగలిగింది. స్కోర్ చేసేందుకు అక్షర్ పటేల్ తీవ్రంగా శ్రమించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. 22 బాల్స్ ఆడిన అక్షర్ కేవలం 11 రన్స్ మాత్రమే చేసి వైభవ్ అరోరా బౌలింగ్ లో 19వ ఓవర్ లో ఔటయ్యాడు. అశుతోష్ శర్మ (39, 30 బంతులలో 3 ఫోర్లు, 3 సిక్సులు) ఒక్కడు మధ్య మధ్యలో బౌండరీలు సాధిస్తూ కొంత గౌరవ ప్రదమైన స్కోర్ వచ్చేందుకు ప్రయత్నించాడు. 20వ ఓవర్ 2వ బాల్ కు త్యాగి బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించిన కోల్ కతా బౌలర్లు:

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా మ్యాచ్ పై పట్టు సాధించింది. వెంట వెంటనే బ్యాటర్లను పెవిలియన్ పంపిస్తూ తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది. 5వ ఓవర్ లో కేఎల్ రాహుల్ ను త్యాగి ఔట్ చేయడంతో ఢిల్లీ వికెట్ల పతనం ఆరంభమైంది. 8వ ఓవర్ చివరి బాల్ కు గ్రీన్  నితీశ్ రాణా (8) అవుట్ చేశాడు. 10 ఓవర్ సునీల్ నరైన్ 5వ బాల్ కు సమీర్ రిజ్వీ (3) పెవిలియన్ కు పంపాడు. ఇక 11 ఓవర్ లో అనుకుల్ రాయ్ రెండు వికెట్లు తీసి ఢిల్లీకి పెద్ద దెబ్బ కొట్టాడు. పాతుమ్ నిస్సాంక స్టంప్ ఔట్, స్టబ్స్ బౌల్డ్ చేసి కోలుకోలేని దెబ్బకొట్టాడు. 

ఇక 19వ ఓవర్ 3వ బాల్ కు అక్షర్ పటేల్ ను వైభవ్ అరోరా పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత 20 వ ఓవర్ లో కార్తీక్ త్యాగీ చెలరేగాడు. 2వ బాల్ కు అశుతోష్ శర్మ (39), 4వ బాల్ కు స్టార్ (0)ను ఔట్ చేశాడు.దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 142 రన్స్ మాత్రమే చేయగలిగింది. 

ఢిల్లీ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, క్యామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.