మంచిర్యాల జిల్లాలో అకాల వర్షంతో ప్రమాదవశాత్తు గోడకూలి మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గత నాలుగు రోజుల క్రితం అకాల వర్షం గాలి దుమారానికి గోడ కూలి మృతి చెందిన కొత్తూరుకు చెందిన వెంకటేష్, ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కె లచ్చన్న, గంపలపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు తనుగుల నాగరాజు,అభిరామ్ లు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఎంపీ వంశీకృష్ణ.
మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఎంపీ వంశీకృష్ణ. అకాల వర్షాలు, గాలి దుమారాలు వచ్చేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎంపీ వంశీకృష్ణ.
