అలా పెరిగి ఇలా తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాదులో శుక్రవారం గ్రాము ఎంతంటే..?

అలా పెరిగి ఇలా తగ్గిన గోల్డ్ రేటు.. హైదరాబాదులో శుక్రవారం గ్రాము ఎంతంటే..?

అమెరికా ఇరాన్ మధ్య చర్చలు వేగంగా ముందుకు సాగుతున్నాయనే వార్తలు వచ్చినప్పటికీ బులియన్ మార్కెట్ సెంటిమెంట్లలో పెద్దగా చలనం కనిపించటం లేదు. ఇన్వెస్టర్లు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ నుంచి ఈక్విటీలు, బాండ్స్ వైపు మళ్లిపోవటంతో పెద్దగా చలనం లేకుండా ధరలు కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రిటైల్ షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు ప్రజలు ముందుగా తగ్గిన ధరలను పరిశీలించటం బెటర్. 

మే 8న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. మే 7 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.32 తగ్గుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 268గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 995గా కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 8, 2026న దేశవ్యాప్తంగా కేజీ వెండి రూ.5వేలు పెరుగుదలను నమోదు చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 75వేల వద్ద మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.275గా అమ్మకాలు జరుగుతున్నాయి.