బాలి: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు బుధవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో టైటిలే టార్గెట్‌గా బరిలోకి దిగనుంది. ఇండియా నుంచి ఈసారి అత్యధికంగా ఏడుగురు బరిలోకి దిగుతున్నా.. సింధుతోపాటు యంగ్ సెన్సేషన్ లక్ష్యసేన్‌పైనే ఫోకస్ ఉంది. సింధుకు ఈసారి నార్మల్ డ్రా ఎదురైంది. గ్రూప్–ఎలో ఉన్న హైదరాబాదీ.. టాప్ సీడ్ పొర్న్‌పవీ చొచువాంగ్(థాయ్‌లాండ్)తో జరిగే మ్యాచ్‌తో తన పోరాటాన్ని స్టార్ట్ చేయనుంది. మెన్స్ సింగిల్స్‌లో టాప్ ప్లేయర్లు కెంటా మొమోటా(జపాన్), విక్టర్ అక్సెల్సెన్(డెన్మార్క్), రాస్మస్ గెమ్కే(డెన్మార్క్)తో కలిసి లక్ష్యసేన్ కష్టమైన గ్రూప్–ఎలో ఉన్నాడు. కిడాంబి శ్రీకాంత్ గ్రూప్–బిలో ఉన్నాడు. తన స్థాయికి తగ్గట్టు ఆడితే గ్రూప్ స్టేజ్‌ను దాటగలడు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్‌కు టఫ్ డ్రానే ఎదురైంది. విమెన్స్ డబుల్స్ గ్రూప్–బి లో ఉన్న అశ్విని–సిక్కి జంటకు ఓ మాదిరి డ్రా ఎదురైనప్పటికీ వారి ఫామ్ కాస్త కలవరపెడుతోంది. గ్రూప్ దశలో ఓ ప్లేయర్/జోడీ.. తన గ్రూప్‌లోని మిగతా ముగ్గురితో పోటీ పడుతారు. రెండు గ్రూప్స్‌లో టాప్2లో నిలిచిన వాళ్లు సెమీఫైనల్‌కు క్వాలిఫై అవుతారు.

