సంగీత్ చౌరస్తాలో భారీ హెల్మెట్ శిల్పం.. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన

సంగీత్ చౌరస్తాలో భారీ హెల్మెట్ శిల్పం.. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన

పద్మారావునగర్, వెలుగు: ద్విచక్రవాహనదారులకు హెల్మెట్​ వినియోగంపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో  సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘హెల్మెట్​ ఆన్​, వర్రీస్​ గాన్’ నినాదంతో సంగీత్ చౌరస్తా కార్నర్ వద్ద భారీ హెల్మెట్ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ బి.సుమతి ముఖ్య అతిథులుగా హాజరై శిల్పాన్ని ఆవిష్కరించారు.