ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కోసం…సి-విజిల్ యాప్

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కోసం…సి-విజిల్ యాప్

ఎన్నికల వేళ అందరూ అప్రమత్తంగా ఉండాలి లేదంటే నియమావళి ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నికల రూల్స్ పాటించని వారిపై నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్కి సి-విజిల్‌ యాప్‌ సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. ఉల్లంఘనలకు పాల్పడిన ఘటనకు సంబంధించి ఫొటో, వీడియోను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

తొలిసారిగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో ఈ యాప్‌ను ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచినప్పటికీ ఈ యాప్‌పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేని కారణంగా ఈ యాప్‌ను ప్రజలు పెద్దగా వినియోగించుకోలేదు. యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను నేరుగా స్వీకరించి ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి ఇందుకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు సీ విజిల్ యాప్ నోడల్ ఆఫీసర్ రవీందర్. ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు స్పందించాలని, నిఘా బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

అంతేకాదు ఈవీఎంలను, వీవీ ప్యాట్‌లతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులపై ఇంట్లో కూర్చునే సీ-విజిల్ యాప్ ద్వారా నేరుగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.