బంగారం ధరలు ఇలా తగ్గుతున్నాయేంటి.. ఇంకా ఎంత తగ్గవచ్చు.. హైదరాబాద్లో తులం ఎంత అంటే..

బంగారం ధరలు ఇలా తగ్గుతున్నాయేంటి.. ఇంకా ఎంత తగ్గవచ్చు.. హైదరాబాద్లో తులం ఎంత అంటే..

బంగారం ధరలు మళ్లీ దిగి  వస్తున్నాయి. గత వారంలో రాకెట్ స్పీడుతో ఆల్ టైమ్ హై దాటిన గోల్డ్.. మళ్లీ అదే వేగంతో ధరలు పడిపోవడం సామాన్యులకు ఊరట కలిగిస్తోంది. యూఎస్ టారిఫ్ వార్ తో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు బంగారమే సేఫ్ బెట్ అనుకున్న వేళ.. రెక్కలొచ్చినట్లుగా పెరిగింది పసిడి. దానికి తోడు గ్లోబల్ గా వివిధ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్ బ్యాంకులు బారీగా బంగారం నిల్వలు పెంచుకోవడం మొదలు పెట్టడంతో ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో కూర్చున్నాయి. కానీ ఈ వారంలో ధరలు మళ్లీ దిగివస్తుండటం కాస్త ఉపశమనం అనే చెప్పవచ్చు. 

గురువారం (మే 1) న బంగారం ధరలు భారీగా పడిపోయాయి. బుధవారం స్తబ్దుగా ఉన్న రేట్లు మేడే రోజున ఒక్క సారిగా పడిపోయాయి. బుధవారం అక్షయ తృతీయ కావడంతో భారీగా పెరుగుతుందేమో అని ఊహించారు. కానీ ఇప్పటికే పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపలేదు పసిడి ప్రియులు. దీంతో గురువారం హైదరాబాద్ లో గోల్డ్ రేట్లు భారీగా పడిపోయాయి. 

హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు రూ.2180 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 95 వేల 730 రూపాయలుగా ఉంది. బుధవారం (నిన్న) రూ.97,910 వద్ద ఉన్న ధర 2 వేలకు పైగా తగ్గడం వివేషం.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై సరిగ్గా 2 వేల రూపాయలు తగ్గింది. దీంతో మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర 87,750 రూపాయల వద్ద ఉంది. 

బంగారంపై ప్రపంచ మార్కెట్లలో డిమాండ్ కాస్త తగ్గుతుండటమే ఇందుకు కారణం. భౌగోళికంగా ఉన్న ఉద్రిక్తతలు, టారిఫ్ వార్ ల కారణంగా ఇన్నాళ్లు బంగారం సేఫ్ బెట్ గా ఇన్వెస్టర్లు భావించారు. అయితే టారిఫ్ ల విషయంలో ట్రంప్  కాస్త తగ్గడంతో మార్కెట్లలో భయాలు తగ్గడంతో బంగారాన్ని ఎక్కువ మొత్తంలో తగ్గించారు. బ్యాంకులు కూడా ఇప్పటికే గోల్డ్ రిజర్వులు పెంచుకున్నాయి.  దీంతో ఇండియాలో గోల్డ్ రేట్లు మరింతగా తగ్గుతూ వస్తున్నాయి.