ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. పైగా ఇవి ఇటీవలి కాలంలో తమ జీవితకాల గరిష్ఠాలకు అతి చేరువకు వెళ్లాయి. ఈ సమయంలో ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాణిజ్య సమస్యలు, మార్కెట్ల ప్రకంపనలు ఇన్వెస్టర్ల సంపదను పెద్ద రిస్క్ లో పెడుతున్నాయి. అయితే ఎందులో డబ్బు పెడితే పతనంలో కూడా అది సేఫ్ గా ఉంటుందనే విషయాన్ని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ రియోసాకీ వెల్లడించారు.
ఈ క్రమంలో పెట్టుబడిదారులు ప్రధానంగా ముఖ్యమైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టా్లని అది వారిని భారీ పతనం నుంచి కాపాడుతుందని చెప్పారు. కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక అస్థిరతలు ఊహించని ఆర్థిక పతనానికి దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితి ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని ఖచ్చితంగా మేల్కోవాల్సిన సమయం ఇక వచ్చేసిందని చెప్పారు.
పతనంలోనూ కాపాడే పెట్టుబడులు..
* ప్రభుత్వాలు ముద్రించే ఫియెట్ కరెన్సీలు ఎల్లప్పిటికీ ఫేక్ అని.. పేదలను అవి ఇంకా పేదలుగా మారుస్తుంటాయని కియోసాకి అన్నారు. అందుకే ప్రజలు తమ డబ్బును బిట్ కాయిన్, సిల్వర్, గోల్డ్, ఇథిరియం వంటి నిజమైన ఆస్తుల్లో పెట్టాలన్నారు. బిట్ కాయిన్ పరిమిత స్థాయిలో మైనింగ్ చేయటానికి వీలు ఉన్నందున డబ్బును అతి భయపెడుతుందని చెప్పారు. అందుకే దానిని కొనొచ్చని చెప్పారు.
* అలాగే ప్రభుత్వాలు విక్రయించే బాండ్స్ అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా పెద్ద అబద్ధంగా కియోసాకీ చెప్పారు. తక్కువ రిస్క్ తీసుకోవాలనుకునే ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం నుంచి బాండ్స్ కొనటం వరకు వివిధ మార్గాలను ఎంచుకుంటుంటారని, కానీ ఇవి సేఫ్ అనుకోవటం భ్రమగా పేర్కొన్నారు కియోసాకీ.
