ఇది మామూలు దూకుడు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా 23 టీమ్స్తో ACB రైడ్స్.. భారీగా నగదు, డాక్యుమెంట్లు సీజ్

ఇది మామూలు దూకుడు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా 23 టీమ్స్తో ACB రైడ్స్.. భారీగా నగదు, డాక్యుమెంట్లు సీజ్

అవినీతి నిరోధక శాఖ (ACB) దూకుడు పెంచింది. కానీ ఇది మామూలు దూకుడు కాదు. ఒకే రోజు 23 టీమ్స్ తో రాష్ట్రవ్యాప్తంగా రైడ్స్ నిర్వహించడం సంచలనంగా మారింది. 2025 నవంబర్ 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఒకేసారి ACB సోదాలకు దిగింది. 

గండిపేట్, శేరిలింగంపల్లి, మెడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల్, పెదపల్లి, భూపాలపల్లి, వైరా లో ఏసీబీ దాడులు చేసింది. సోదాల్లో రూ. 2 లక్షల 52 వేల అకౌంటింగ్ లేని డబ్బును సీజ్ చేశారు అధికారులు. అదేవిధంగా 289 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, కార్యాలయాల్లో నగదు పట్టివేశారు. 

ఈ సోదాల్లో 19 మందివ ప్రైవేట్ వ్యక్తులు, 60 డాక్యుమెంట్ రైటర్లు అనుమతి లేకుండా కార్యాలయాల్లో అవినీతి కి పాల్పడినట్లు గుర్తించారు. చాలా కార్యాలయాల్లో CCTV కెమెరాలు పని చేయనట్లు గుర్తించారు. డిజిస్టర్ కార్యాలయాల్లో లోపాలను గుర్తించిన  ACB ప్రభుత్వానికు నివేదిక అందజేయనుంది.

అదే విధంగా SRO ఇళ్లలో కూడా సెర్చ్‌ చేశారు ఏసీబీ అధికారులు. అందులో భాగంగా13 మంది SROల ఇళ్లలో నగదు, ఆభరణాలు, ప్రాపర్టీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.