బీచ్ లో కూర్చొని రెండు పెగ్గులేసుకోకుండా.. టీ తాగుతారా.. ?: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

బీచ్ లో కూర్చొని రెండు పెగ్గులేసుకోకుండా.. టీ తాగుతారా.. ?: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీచ్ లో కూర్చొని రెండు పెగ్గులేసుకోకుండా టీ తాగుతారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ 2025 లో పాల్గొన్న ఆయన ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ తాగడానికి టూరిస్టులు ఎవరైనా విశాఖ బీచ్ కు వస్తారా అంటూ ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. భర్త బీచ్ లో కూర్చొని రెండు పెగ్గులేస్తుంటే భార్యలు ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేయడానికి బీచ్ కి వస్తారని అన్నారు అయ్యన్నపాత్రుడు.

తాను ఇటీవల గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలవడానికి వెళ్లానని.. అక్కడ బీచ్ లలో విశాఖలో లాగా రిస్ట్రిక్షన్స్ లేవని అన్నారు అయ్యన్నపాత్రుడు. క్యాసినో పబ్ కల్చర్ లాంటివి విశాఖలో అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం లిబరల్ గా ఉండాలని అన్నారు. ప్రభుత్వాలు రిస్ట్రిక్షన్స్ పెడితే టూరిజం డెవలప్ అవ్వదని అన్నారు అయ్యన్నపాత్రుడు. విశాఖలో అలాంటి అట్రాక్షన్స్ లేకపోవడంతోనే తెలుగు రాష్ట్రాల పర్యాటకులు గోవా, శ్రీలంక వంటి ప్రాంతాలకు వెళ్తున్నారని అన్నారు. 

గోవాలో తరహాలో రిస్ట్రిక్షన్స్ లేని టూరిజం పాలసీ విశాఖలో తీసుకురావాలని అన్నారు అయ్యన్నపాత్రుడు. ఆ దిశగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు అయ్యన్నపాత్రుడు. అయ్యన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.