శనివారం ( నవంబర్ 15 ) అంబర్ పేట్ లోని బతుకమ్మ కుంటను సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ సందర్భంగా స్థానికులతో కలసి వాకింగ్ చేసిన రంగనాథ్.. బతుకమ్మ కుంట అభివృద్ధిపై వాకర్లను అడిగి తెలుసుకున్నారు. వాకింగ్‌కు ఎంత మంది వస్తున్నారు, వారికి ఎలా ఉపయోగపడుతోందని వంటి విషయాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు రంగనాథ్.
బతుకమ్మకుంట ఇప్పుడు స్థానికులకు విహార కేంద్రంగా మారిందని.. కుంట అందుబాటులోకి రావడంతో పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయని కమీషనర్ కి తెలిపారు స్థానికులు.
వాకింగ్ కారణంగా ఆరోగ్యాలు కాపాడుకుంటున్నామని.. ఒకప్పుడు దుర్గంధం, వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు శుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తోందని అభిప్రాయపడ్డారు స్థానికులు.చెరువు చుట్టూ నాటిన మొక్కలు పెద్దవైతే మరింత హరిత వాతావరణం ఏర్పడుతుందని అన్నారు కమిషనర్. చెరువును శుభ్రంగా కాపాడేందుకు ప్రజలు హైడ్రాతో కలిసి పనిచేయాలని అన్నారు కమిషనర్.
ఈ సందర్భంగా కమిషనర్‌తో ఫోటోలు దిగారు స్థానికులు. తమకు ప్లే ఏరియా పెట్టించినందుకు థాంక్యూ సార్ అంటూ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు చిన్నారులు.
