I BOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్.... చంచల్ గూడా జైలుకు తరలింపు..

I BOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్.... చంచల్ గూడా జైలుకు తరలింపు..

ఐబొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నెదర్లాండ్స్ నుంచి వచ్చిన రవిని శనివారం ( నవంబర్ 15 ) ఉదయం హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో రవిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. చాలా కాలంగా ఐబొమ్మ రవిపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడంతో ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడినట్లయింది.

నిందితుడు రవి హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న రెయిన్ బో విస్టాలో నివాసం ఉంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు నేరుగా కూకట్ పల్లి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రవిని అరెస్ట్ చేసిన సమయంలో పైరసీ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా ఐదు సంవత్సరాల క్రితమే రవి తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

రవి ఖాతాలో ఉన్న రూ. 2.5 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రవి అపార్ట్మెంట్లో కంప్యూటర్లు, వందల హార్డ్ డిస్క్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రవి వాడిన సర్వర్లు సైతం గుర్తించి.. అతను పైరసీ చేసిన వందల సినిమాల వివరాలు సేకరించారు. రవి నెట్వర్క్ తెలుసుకున్న పోలీసులు మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.