ఇమ్మడి రవి (IMMADI RAVI).. ఇపుడు టాలీవుడ్ లోనే కాదు.. సినీ ప్రేక్షకుల్లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. థియేటర్లో సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే HD ప్రింట్ పైరసీ చేసి ఐబొమ్మ సైట్లో విడుదల చేసేది ఇతనే. తన మాస్టర్ మైండ్తో కొన్నాళ్లుగా సినీ పరిశ్రమను అతలాకుతలం చేస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలో తెలుగు సినీ నిర్మాతల కంప్లైంట్ అందుకున్న పోలీసులు.. ఎట్టకేలకు ఇమ్మడి రవిని ఇవాళ (2025 నవంబర్15న) అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో కూకట్ పల్లి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. అయితే, Ibomma సర్వర్ వెబ్సైట్లుపై ఇమ్మడి రవి నుండి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు.
కీలక సమాచారం సేకరించిన పోలీసులు..
Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవి ఆంధప్రదేశ్ వైజాగ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కూకట్ పల్లిలో ఉన్న అతని అపార్ట్మెంట్లో కంప్యూటర్లు, వందల హార్డ్ డిస్క్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవి వాడిన సర్వర్లు సైతం గుర్తించి.. అతను పైరసీ చేసిన వందల సినిమాల వివరాలు సేకరించారు.
ఇమ్మడి రవి నెట్వర్క్ తెలుసుకున్న పోలీసులు మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు.. ఇమ్మడి రవి చేసిన పైరసీ వ్యవహారంపై ఎలాంటి తీర్పు ఇవ్వనుందో అనే ఆసక్తి సినీవర్గాల్లో నెలకొంది.
