చైనాలో బయటపడ్డ బంగారు నిధి.. ఆ కొండల్లో దాగిన 1000 టన్నుల గోల్డ్..

చైనాలో బయటపడ్డ బంగారు నిధి.. ఆ కొండల్లో దాగిన 1000 టన్నుల గోల్డ్..

చైనాలోని షింజియాంగ్ కున్‌లున్ పర్వత ప్రాంత వద్ద భారీగా గోల్డ్ రిజర్వును అక్కడి ప్రభుత్వం గుర్తించింది. భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసిన సర్వే ప్రకారం ఆ ప్రాంతంలో దాదాపు వెయ్యి టన్నులకుపైగా స్వచ్ఛమైన బంగారం ఉండొచ్చని అంచనా వేయబడింది. వాస్తవానికి చైనా చరిత్రలో ఇంత భారీ గోల్డ్ రిజర్వు గుర్తించటం ఇది మూడోసారి కావటం గమనార్హం.

కాష్గర్ భూగర్భ శాస్త్ర బృందంలోని సీనియర్ ఇంజనీర్ హె ఫుబావో, అతని సహచరులు నవంబర్ 4న దీనిని ధ్రువీకరించారు. ఇది ఏడాదిలో చైనా ప్రకటించిన మూడవ భారీ బంగారు నిధి. దీనికి ముందు లియోనింగ్, హునాన్ ప్రాంతాల్లో ఇప్పటికే రెండు పెద్ద గోల్డ్ రిజర్వులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో చైనా ప్రభుత్వం మైనింక్ కోసం కేవలం 3వేల టన్నుల గోల్డ్ రిజర్వ్స్ మాత్రమే ఉంటాయని అంచనా వేసింది. కానీ వరుసగా బయటపడుతున్న కొత్త నిధులు అంచనాలను తారుమారు చేస్తున్నాయి. 

ALSO READ : 40 వేల గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ..

ప్రస్తుతం చైనా అధునాతన సాంకేతిక పరికరాలతో పాటు ఏఐ ఆధారిత విశ్లేషణ, అధిక శక్తి గల రాడార్ వ్యవస్థలు, ఖచ్చితమైన మినరల్ శాటిలైట్లు వంటి టెక్నాలజీలను వినియోగించటం మంచి ఫలితాలను ఇస్తోందని వెల్లడైంది. కున్‌లున్ పర్వతాలు చైనీస్ పురాణాలలో పవిత్ర స్థానంగా పేరుగాంచాయి. “మౌంటు ఒలింపస్”లాగే దేవతల నిలయంగా ప్రజలు భావిస్తుంటారు. 

కొత్తగా కనుగొనబడిన క్వోకేజిలెగా బంగారు గని 100 కిలోమీటర్ల పొడవైన శిలా విభజన రేఖలో ఉంది. భూమి చరిత్రలో కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం తీవ్రంగా విరిగిపోయి. బంగారం శతాబ్దాల తరబడి క్వార్ట్జ్ రాళ్లలో దాగి ఉండిపోయిందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే 2018లో చైనా నిర్మించిన భూగర్భ అన్వేషణ యాంటెనా వ్యవస్థ.. కేవలం గోల్డ్ మాత్రమే కాకుండా.. లిథియం, యురేనియం, అరుదైన లోహాలు, క్రూడాయిల్, సహజవాయువు వంటి కీలక వనరుల అన్వేషణలో సహాయపడుతోంది.