17న గీత కార్మికుల నిరాహార దీక్ష

17న గీత కార్మికుల నిరాహార దీక్ష

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర  బడ్జెట్​లో గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 వేల కోట్లు కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి. రమణ డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గత బడ్జెట్‌లో కేటాయించిన ₹70 కోట్లు కూడా విడుదల చేయలేదన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల హామీలైన పెన్షన్ పెంపు, ఎక్స్‌గ్రేషియా పెంపు అమలు చేయాలని కోరుతూ ఈనెల 17న ఇందిరా పార్క్ వద్ద చేపట్టే నిరాహారదీక్షకు వేలాదిమంది గీత కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు.