నాంపల్లి రైల్వే స్టేషన్లో జీఎం తనిఖీ

నాంపల్లి రైల్వే స్టేషన్లో జీఎం తనిఖీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: నాంపల్లి రైల్వే స్టేషన్​లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ధి ప్రణాళికలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎంకు వివరించగా, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

అనంతరం స్టేషన్ పశ్చిమ వైపున ఉన్న క్యారేజ్ మెయింటెనెన్స్ డిపోను సందర్శించి, అక్కడ సిబ్బందికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ తనిఖీలో సికింద్రాబాద్ డీఆర్​ఎం డాక్టర్ గోపాలకృష్ణన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.