Varanasi Glimpse: మహేశ్వరుడి దర్శనం వచ్చేసింది.. త్రిశూలం, నంది మైథాలజీ టచ్తో రాజమౌళి మూవీ

Varanasi Glimpse: మహేశ్వరుడి దర్శనం వచ్చేసింది.. త్రిశూలం, నంది మైథాలజీ టచ్తో రాజమౌళి మూవీ

మహేష్ బాబు, రాజమౌళి మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. "వారణాసి" అనే టైటిల్ తో మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ రూమర్స్ వినిపించాయి. అందరూ అనుకున్నట్లుగానే మహేష్ బాబు సినిమాకు ‘వారణాసి’ అని ఫిక్స్ చేశారు జక్కన్న.

ఈ క్రమంలో మహేష్ బాబుకి సంబంధించిన లుక్, క్యారెక్టర్ రివీల్ చేశారు. ఇందులో "రుద్ర" అనే పాత్రలో మహేష్ కనిపించబోతున్నట్లు గ్లింప్స్ రిలీజ్ చేశారు. త్రిశూలం, నంది మైథాలజీ టచ్ తో మహేష్ బాబు ఎంట్రీ అదిరిపోయింది. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో మహేష్ బాబు కనిపించారు. ఈ క్రమంలో మహేశ్వరుడి దర్శనం అన్నట్లుగా గ్లింప్స్ సాగింది.

ఈ సినిమా చరిత్ర, పురాణాల మిశ్రమంగా ఉండబోతోంది. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో SSMB29 బృందం పవిత్ర కాశీ నగరాన్ని పునఃసృష్టించింది. శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసిందేకు జక్కన్న కసరత్తు చేసి మన ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్ బట్టి తెలిసిపోయింది. పురాణాల పట్ల రాజమౌళి తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడూ వ్యక్తం చేస్తూనే ఉంటాడు. ఇది ఆయన చాలా సినిమాల్లోను, స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ట్రెండ్ "వారాణసి"లో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు.

భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీని నిర్మాత కె.ఎల్‌. నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇందులో భాగం అవుతున్నారు. ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్కి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా.. కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. దేవాకట్టా డైలాగ్స్ అందిస్తున్నారు. 2027 సమ్మర్ లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.