టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అలాగే ప్రతి ఒక్కరి కలల రాజకుమారుడిగా గుర్తింపు పొందారు మహేష్ బాబు. ఇంతకాలం వీరిద్దరి ప్రాజెక్ట్ పై చిన్న న్యూస్ తెలిసిన చాలు.. అది మాకు ఎంతో సంతోషం అంటూ సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తూ వచ్చారు. ఇవాల్టీతో నీరీక్షణ ముగిసింది. టైటిల్ "వారణాసి"గా ప్రకటించారు జక్కన్న. ఈ క్రమంలో ఇప్పటివరకు SSMB29 నుంచి రిలీజ్ ఐన పోస్టర్స్, సాంగ్స్ పై.. మరింత క్షుణ్ణంగా ఫోకస్ చేస్తున్నారు ఆడియన్స్. మరి ముఖ్యంగా " సంచారి సాంగ్ " లిరిక్స్ గమనిస్తున్నారు. ఇందులోని శివతత్వం, హీరో సాహసం, తనలోని అఖండమైన శక్తిని తెలుసుకుంటున్నారు. సో.. ఆలస్యం చేయకుండా లిరిక్స్ వైఫు ఓ లుక్కెయండి.
పల్లవి:
కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగులే..
వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే..
ఖండాలే దాటేస్తూ కగరాజై వాలే..
రా రా.. రా రా.. ధీర.. ధృవతారా..
పల్లవి మొదటి లైన్ గమనిస్తే.. 'కాలాన్ని ఆదేశిస్తూ, రోజూ పరిగెత్తుతూ' అనే పదాల వెనుక మహోత్తరమైన అర్ధం దాగి ఉంది. శివుడు మహాకాలుడు- నిత్యం భ్రమించే కాలాన్ని సృష్టించి, పాలించడమే కాకుండా సంహరించే దేవుడు అనే అర్ధాన్ని వివరిస్తుంది. అంతేకాదు.. ఈ కాలం అనే మహాచక్రంలో నిత్య నటరాజులా నిరంతర చలనంలో ఉంటాడని కూడా చెబుతోంది.
రెండవ లైన్ గమనిస్తే.. వేగాన్ని శ్వాసలా తీసుకుంటూ, ఆ ప్రచండమైన గాలితో సరి సమానంగా ప్రయాణించేవాడని అర్ధం. పెనుగాలి లాంటి ఆ మహాకాల రుద్రుడు, వేగవంతమైన సంహార శక్తి కలవాడు అని అర్థం. అయితే, ఇక్కడ 'శ్వాశ' అంటే శివుడే అని అర్థం వస్తుంది. ఎందుకంటే, ఈ సృష్టికి శివుడే ప్రాణదాత. ఈ అఖండమైన విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నది ఆ శివుడే. పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు లను తనలో లయం చేసుకుని లయకారుడు అయ్యాడు.
అలాంటి సంచారిలా మహేష్ బాబు SSMB 29లో, గురుత్మంతుడిలాంటి వేగం, శివుడి వాహనం అయిన నంది శక్తిని కలగలుపుకుని అసుర సంహారం చేసే యోధుడు. ఎప్పటికీ నిలిచి ఉండే ధృవతారలా స్థిరమైనవాడు.. కైలాసం నుంచి సమస్తలోకాలకు సంచారి శివుడుని సూచిస్తూ సాగింది.
చరణం:
సంచారి.. సంచారి.. నినదించే రణభేరి
సంహారి.. సంహారి.. మృత్యువుపై తన స్వారి
సంచారి.. సంచారి.. సాహసమే తన దారి
సంహారి.. సంహారి.. అసురులపై అసిధారి
నినదించే రణభేరి అంటే ఇది శివుడి డమరుకాన్ని సూచిస్తోంది.. రణభేరి లాంటి శబ్దం, సృష్టి-సంహార నాదం. సంహారకుడు, మరణం మీద సవారీ చేసేవాడు అంటే ఎవరు? ఇంకెవరు శివుడే.. మృత్యువుపై సవారీ చేసే శ్మశానవాసి, మరణ భయం లేనివాడు పరమేశ్వరుడు. శివుడు వీరభద్రుడు – అసుర సంహారంలో ధైర్య స్వరూపుడు. శివుడు త్రిపురాంతకుడు-అసురులను (త్రిపురాసురులు) ఖడ్గం(అశి)తో సంహరించినవాడని అర్థం.
సంచారీ పాటలో ముఖ్యమైన అర్థాలు గమనిస్తే;
సంచారీ-శివుడి నిరంతర తాండవం
సంహారీ=శివుడి రుద్ర / కాలభైరవ స్వరూపం- అసుర సంహారం
మృత్యువుపై స్వారీ= మృత్యువును శాసించేవాడు, మృత్యుంజయుడు పరమేశ్వరుడే
కాలాన్ని శాసిస్తూ= మహాకాలేశ్వరుడు- కాలచక్రాన్ని నడిపేవాడు.
