నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు భద్రత కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వర్సిటీ అధికారులను ఆదేశించారు. శనివారం వర్సిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ..బాసర ట్రిపుల్ఐటీలో జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ గురించి వివరాలు తెలుసుకున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వ హించాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను స మీక్షించారు. మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలన్నా రు.
సిబ్బందిని నియమించుకునే ప్రక్రియలో తప్పనిసరిగా రిజర్వేషన్ పద్ధతిని పాటించాలని ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ వారికి అందుతున్న వసతులు, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పలువురు అధికారులు, చైర్మన్, సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యురాలు కుస్త్రం నీలాదేవి, వీసీ గోవర్ధన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
