
- కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్‌లోని గుండ్ల చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా నిర్మిస్తామని మంజూరైన 3 కోట్ల నిధులను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మింగేశాడని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇరిగేషన్ ఆఫీసర్స్, రైతులతో కలిసి ఆయన గుండ్ల చెరువును పరిశీలించి మాట్లాడారు. తూముల కాల్వలను చిన్న గా నిర్మించడంతో నీరు వృథా అవుతుందని, సుమారు 400 ఎకరాల ఆయకట్టు పొలాలు ఎండుతున్నాయన్నారు.
మూడు తూములు, కట్ట చివర చిన్న బ్రిడ్జ్ నిర్మాణానికి ఎస్టిమేట్ వేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తూములు, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. పర్యాటక రంగంగా గుండ్ల చెరువు ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంజూరు చేసిన టీయూఎఫ్ఐడీసీ రూ. 4 కోట్ల తో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. మున్నూరు కాపు మూడు పంథాలకు చెందిన కాశీ హన్మాన్, గురడి కాపు, కాపెళ్లి పంథా రైతులు పాల్గొన్నారు.