
బెల్లంపల్లి, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అభ్యంతరకర కామెంట్లు చేశారని పీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ కాంపెల్లి ఉదయ్ కాంత్ శనివారం లీగల్ నోటీసు పంపారు. ఈనెల18న బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురజాల గ్రామపంచాయతీలో జరిగిన రైతు వేదిక సభలో చిన్నయ్య...
ఎంపీ రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారని, వాటిలో వాస్తవం లేదన్నారు. ఈ కామెంట్లు రేవంత్ రెడ్డికే కాక, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్నాయని చెప్పారు. అందుకే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.