APPSCలో ఇంటర్వ్యూల పద్ధతి రద్దు: సీఎం జగన్

APPSCలో ఇంటర్వ్యూల పద్ధతి రద్దు: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.  APPSC ద్వారా జరిగే ఉద్యోగ నియామకాల్లో ఇకపై ఇంటర్వ్యూలు ఉండబోవన్నారు. APPSC పనితీరు, నియామకాలపై సమీక్ష నిర్వహిచారు సీఎం జగన్. ఇక నుంచి APPSC నియామకాల్లో ఇంటర్వ్యూ పద్ధతిని తొలగించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రావాలని స్పష్టం చేశారు. అంతేకాదు నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు… పూర్తి పారదర్శకత ఉండేలా వ్యవహరించాలని సూచించారు సీఎం జగన్.