75వ కాన్స్‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌కి వెళ్తున్న పూజ

75వ కాన్స్‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌కి వెళ్తున్న పూజ

వరుసగా మూడు సినిమాలు ఫెయిలయ్యేసరికి పూజా హెగ్డేకి బ్యాడ్ టైమ్ స్టార్టయ్యిందని, ఆమె కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాఫ్ పడిపోతోందని కామెంట్లు చేశారు చాలామంది. అంత సీన్‌‌‌‌‌‌‌‌ లేదని, తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్ని బ్యాగ్‌‌‌‌‌‌‌‌లో వేసుకుంటూ ప్రూవ్ చేస్తోంది పూజ. మహేష్, సల్మాన్​లతో నటించనుంది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ తానేంటో చూపించ బోతోంది.
75వ కాన్స్‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌కి పూజ వెళ్తోంది. యేటా ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనడానికి ప్రపంచ నలుమూలల నుంచి  సినీ సెలెబ్రిటీలు వస్తారు. ఈసారి మన దేశం నుంచి ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనెలతో పాటు పూజ కూడా వెళ్తోంది. మే 17, 18 తేదీల్లో జరిగే ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌ కానుంది. స్టార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా సౌత్‌‌‌‌‌‌‌‌లో చక్రం తిప్పుతున్న పూజకి ఈ ఘనత దక్కడం నిజంగా విశేషమే.