పీవీ ఎక్స్‌‌‌‌ప్రెస్ వేపై  కారు బోల్తా.. సడన్ బ్రేక్ వేయడంతో పల్టీ కొట్టిన కారు

పీవీ ఎక్స్‌‌‌‌ప్రెస్ వేపై  కారు బోల్తా.. సడన్ బ్రేక్ వేయడంతో పల్టీ కొట్టిన కారు

మెహిదీపట్నం, వెలుగు: పీవీఎన్ఆర్ ఎక్స్​ప్రెస్​వేపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. షాద్​నగర్​కు చెందిన మీర్జా జుబేర్ బేగ్ (26) సోమవారం సాయంత్రం తన కారులో బంజారాహిల్స్​లోని సోదరుడి ఇంటికి బయలుదేరారు.  

పీవీ ఎక్స్​ప్రెస్​వే నుంచి వెళ్తుండగా మెహదీపట్నం వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, జుబేర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా ఎక్స్​ప్రెస్​వేపై దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి క్రేన్ సహాయంతో వాహనాన్ని తొలగించి, ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. జుబేర్ ఉపవాసం ఉండటంతో ఒక్కసారిగా కళ్లు తిరిగినట్లు అనిపించి, సడన్​బ్రేక్ వేయడంతో కారు పల్టీ కొట్టిందని మెహదీపట్నం సీఐ మల్లేశ్ తెలిపారు.