జీడిమెట్ల, వెలుగు: తన మేనల్లుడిని కారులో తిప్పడానికి తీసుకెళ్లిన ఆ యువ సాప్ట్వేర్ ఇంజినీర్ యాక్సిడెంట్లో మృతి చెందాడు. నిజాంపేట్‌కు చెందిన సాయితేజ్ (28) మంగళవారం తన 8 ఏండ్ల మేనల్లుడు రుషిరాజ్ను తీసుకుని కారులో మేడ్చల్ వరకు వెళ్లాడు.
తిరిగి వస్తుండగా మల్లంపేట్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 4ఏ వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి రెయిలింగ్ ఇనుప కడ్డీ కారు అద్దాన్ని చీల్చుకుంటూ సాయితేజ్ శరీరంలోకి చొచ్చుకుపోగా, అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న బాలుడు రుషిరాజ్ గాయాలతో బయటపడగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

