ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ కు వ్యతిరేకంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, లా ఎన్ఫోర్స్మెంట్ కీలక పురోగతి సాధించిన వార్త ఇది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ సలిమ్ దోలా టర్కీలోని ఇస్తాంబుల్ అరెస్టయ్యాడు. అండర్ వరల్డ్ లో డ్రగ్ కింగ్ పిన్ గా కొనసాగుతున్న దోలాను 2026 ఏప్రిల్ 28న ఇండియాకు అప్పగించింది టర్కీ. హై సెక్యూరిటీ మధ్య స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో దోలాను ఢిల్లీ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు.
దోలాను ఇండియాకు అప్పగించడం అండర్ వరల్డ్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. అండర్ వరల్డ్ లోని డీ–కంపెనీ కి చెందిన డ్రగ్ ఆపరేషన్స్ ను విదేశాల్లో నిర్వహిస్తున్నది ఇతడే. ఏడాదికి 5 వేల కోట్ల రూపాయల డ్రగ్, నార్కోటిక్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నెట్ వర్క్ కు ఇది గట్టి దెబ్బ అని ముంబై సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే దోలాను కస్టడీలోకి తీసుకున్నారు. వివిధ అంశాలపై ప్రశ్నించనున్నారు. కీలక ఇంటరాగేషన్ తర్వాత ముంబై పోలీసులకు లేదా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కకు అప్పగించనున్నారు.
కుమారుడి అరెస్టుతో మొదలైన పతనం:
2025 జూన్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి సలీం డోలా కుమారుడు తాహెర్ డోలాను విజయవంతంగా అప్పగించడంతో ప్రారంభమైంది డోలా పతనం. ఆ తర్వాత సలీం డోలాను ఎమిరేట్స్ లాంటి దేశాలు బహిష్కరించడం ఇండియన్ ఏజెన్సీలకు మరొక విజయం అని చెప్పవచ్చు.
కొన్ని నెలల తర్వాత, డోలా నెట్‌వర్క్‌లో ప్రధాన అనుచరుడైన సలీం మహమ్మద్ సోహైల్ షేక్‌ను దుబాయ్ నుండి బహిష్కరించేలా చేయడం ఇండియా విజయం సాధించింది. ఆ తర్వాత సోహైల్ షేక్ ను ముంబై నార్కోటిక్స్ సెల్ అరెస్టు చేయడంతో ఈ ఊపు కొనసాగుతూ వస్తోంది. భారీస్థాయిలో మాదకద్రవ్యాల తయారీ, అంతర్జాతీయ స్మగ్లింగ్ నుంచి మొదలుకొని వివిధ ఇతర నేరాల వరకు అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్న డీకంపెనీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఈ కేసు ఆధారంగా తెలుస్తోంది.

