బోనాల వేడుకల్లో 678 మంది పోకిరీల అరెస్ట్

బోనాల వేడుకల్లో 678 మంది పోకిరీల అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: బోనాల పండుగ- సందర్భంగా మహిళలు, యువతులను వేధిస్తున్న 678 పోకిరీలను  షీటీమ్స్​రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నాయి. టెంపుల్స్, ఊరేగింపు మార్గాలు, బస్టాండ్, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో నిఘా పెట్టిన షీటీమ్స్​వీడియో ఆధారాలతో దొరకపట్టాయి.

ఇందులో11 మందికి 3 రోజుల జైలుశిక్షతోపాటు జరిమానా విధించారు. మిగతా వారిపై పెట్టీ కేసులు నమోదయ్యాయి. ఎక్కడైనా ఆకతాయిలు వేధిస్తున్నట్టయితే డయల్​100/112 తో పాటు షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు ఫిర్యాదు చేయవచ్చని ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డిప్యూటీ కమిషనర్ లావణ్య సూచించారు.