రోడ్లపై మంచు కనిపించినా.. రోడ్లపై ఐస్ కనిపించినా.. మన మనస్సుల్లో ఠక్కున గుర్తుకొచ్చేది కాశ్మీర్.. అవును మంచు దుప్పట్లో కాశ్మీర్ అందాలు ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.. వింటూనే ఉంటాం. రోడ్లపై మంచు కనిపించినా.. వడ గండ్లతో రోడ్డంతా మంచుతో కప్పబడినా.. కాశ్మీర్ అందాలతో పోల్చటం పరిపాటి.. వెరీ కామన్.
ఇలాంటి సిట్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. అందర్నీ ఆకర్షిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..
2026, ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్ సిటీని నల్ల మబ్బులు.. కారు మబ్బులు కమ్మేశాయి. చల్లటి గాలులు వీచాయి. కూల్ వెదర్ అందర్నీ రిలాక్స్ చేసింది.
ఇదంతా సిటీలో జరిగితే.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మాత్రం మరో వింత ఆవిషృతం అయ్యింది.
వడ గండ్లు విపరీతంగా పడ్డాయి. 20 నిమిషాలపాటు ఔటర్ రింగ్ రోడ్డుపై వడ గండ్లు పడటం.. రోడ్డు అంతా ఐస్ తో కప్పేసింది.. ఐస్ గడ్డలతో నల్లటి తారు రోడ్డు.. తెల్లగా మారిపోయింది.
ఈ వింతను చూసి ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు మైమరిచిపోయారు.. ఆనందంతో కార్లు దిగి మరీ ఐస్ ముక్కలతో ఆటలు ఆడారు.
ఇది కాశ్మీర్ అనుకున్నారా.. కాదు కాదు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అంటూ వీడియోస్ షేర్ చేశారు. చూసిన వాళ్లు ఫుల్ కామెంట్లు పెట్టారు.
నల్లటి రోడ్డుపై తెల్లగా పరుచుకున్న ఐస్ ముక్కలతో.. చల్లటి వాతావరణంలో కొద్దిసేపు సేదతీరటంతోపాటు ఆహ్లాదంగా గడిపారు ప్రయాణికులు.
More Videos from #Shamshabad ORR #Hailstrom 🧊⛈️ pic.twitter.com/fMDxZEvtOB
— Hyderabad Rains (@Hyderabadrains) April 27, 2026
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీరు చూసి ఎంజాయ్ చేయండి...
Snow falls on the outer ring road, hyderabad. pic.twitter.com/3did4GHuJ3
— Dileep Reddy (@DileepReddy125) April 28, 2026

