V6 News

కాంగ్రెస్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కాంగ్రెస్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సత్యం

కరీంనగర్ సిటీ, వెలుగు: ఎన్నికల సంఘం ఇటీవల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఈ ప్రక్రియపై  బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన డీసీసీ ఆఫీసులో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో  బ్లాక్, మండల, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల నియామకం, బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది.

సమావేశానికి ముఖ్య అతిథిగా మేడిపల్లి సత్యంతోపాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి,అసెంబ్లీ కో-ఆర్డినేటర్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. 

సమావేశంలో రసాభాస 

కాంగ్రెస్ సమావేశంలో కొద్దిసేపు రసాభాస జరిగింది. కార్పొరేటర్ గంటా శ్రీనివాస్ భార్య గంట కల్యాణి మాట్లాడుతూ సమావేశానికి వచ్చే వారికి  కూర్చునేందుకు కుర్చీల్లేవని అనడంతో కాంగ్రెస్ నాయకులు ముల్కల కవిత, మసూంఖాన్, పెద్దిరెడ్డి తిరుపతి తదితరులు ఆమె మాటలను ఖండించారు. క్రమశిక్షణ తప్పితే  పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని మేడిపల్లి సత్యం హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది.