V6 News

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు :  సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్
  •     సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ హెచ్చరించారు. వచ్చే వానాకాలం సీజన్‌‌కు సంబంధించి నకిలీ విత్తనాల నియంత్రణ, సన్న వడ్లు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపు, ఫార్మర్స్ రిజిస్ట్రీ.. తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫార్మర్స్ రిజిస్ట్రీ ఇప్పటిదాకా 73 శాతం పూర్తయిందని, రైతులను కలిసి ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. 

జిల్లాలోని రైతులు సన్న వడ్లు సాగుచేసేలా ప్రోత్సహించాలని సూచించారు. రివ్యూ డీఏవో అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ, తదితరులు ఉన్నారు.